పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ గురించి హృదయపూర్వకంగా స్పందించారు. గతంలోనే కేజీఎఫ్, కాంతార వంటి భారీ హిట్‌లతో దేశవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్న బెంగళూరు కేంద్రీకృత సంస్థ హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు టాప్ స్టూడియోలలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ఈ సంస్థతో ప్రభాస్‌కు ‘సలార్’ చిత్రంతో బంధం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ అనుబంధం ఇప్పుడు మరింత బలపడుతుంది. హోంబలే తో మరో రెండు భారీ ప్రాజెక్టులు చేయనున్నట్లు గతేడాది…