రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలు లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు హను రావిపూడి తో ‘ఫౌజీ’ చిత్రంలోను నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ రెండు ప్రాజెక్టులు ఇలా ఉంటే మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ కోసం ప్రభాస్‌ని సరికొత్త లుక్‌లో రెడీ చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లు సలార్ 2, కల్కి 2 సీక్వెల్స్ లను తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇలా తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్ కు ఒక తలనొప్పి మొదలయిందట.
Also Read : AA22xA6 : అల్లు అర్జున్-అట్లీ మూవీలో ఆ హీరోయిన్‌ను లాక్ చేసేశారా..?
ఏంటీ అంటే..ఇండియాలోనే టాప్ డైరెక్టర్లు, టాప్ ప్రొడ్యూసర్లు ప్రభాస్ తో కలిసి పని చేయాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటికే పలు ప్రాజెక్టులకు సైన్ చేసిన ప్రభాస్ నిర్విరామంగా, ఏ మాత్రం ఖాళీ లేకుండా ఆ సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్‌కు ఒక బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్‌లో నటించాలని ఆఫర్ వచ్చిందంట. కేవలం త్రీ వర్కింగ్ డేస్‌కి గాను ప్రభాస్‌కు ఏకంగా రూ.25 కోట్లు ఆఫర్ చేశారట. ప్రభాస్ మాత్రం సింపుల్‌గా నో చెప్పారట. కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పెద్ద మొత్తంలో ఛార్జ్ చేస్తున్నారు. కానీ ప్రజంట్ ప్రభాస్ ఉన్న బిజీ షెడ్యూల్ ఇది అయ్యే పనేనా? అందుకే ప్రభాస్ మొదటినుంచి కూడా యాడ్ షూట్‌కు నో చెబుతూనే ఉంటారట.