కోలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో, అల్లు అర్జున్ తన కొత్త సినిమాను చేయనున్నాడనే వార్త ముందు నుంచి వినిపిస్తుననప్పటి.. ఈ విషయాన్ని బన్నీ బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి ఓ కాన్సెప్ట్ వీడియోని కూడా వదిలారు. కాగా ఈ ప్రాజెక్టు ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కబోతున్నట్లుగా చూపించారు. అయితే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాని నిజానికి త్రివిక్రమ్‌తో వస్తుంది అనుకున్నారు. కానీ ‘పుష్ప 2’ లాంటి సూపర్ సక్సెస్ వచ్చిన తర్వాత, త్రివిక్రమ్ లాంటి తెలుగు కే పరిమితమైన దర్శకుడితో చేస్తే ఆయన మార్కెట్ పడిపోతుందనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ అట్లి తో సినిమా చేయడానికి కమిట్ అయ్యినట్లు టాలీవుడ్ టాక్.
Also Read: Venkatesh : రానా నాయుడు సీజన్ 2 అప్‌డేట్..
ఇక.. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుందా అనే చర్చ అప్పుడే మొదలైంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ భారీ బడ్జెట్ సినిమాలో బన్నీకి జోడీగా సమంతని తీసుకోబోతున్నారట. అవును.. సమంత ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ కాబట్టి ఈ పాన్ ఇండియా సినిమాలకి పర్ఫెక్ట్ ఛాయిస్ అని సామ్‌ని సెలక్ట్ చేసినట్లుగా వార్తలు వినపడుతున్నాయి. ప్రజంట్ ‘పుష్ప’ తో అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఇక అట్లీ ఎలాగూ ‘జవాన్’ తో బాలీవుడ్ లో రూ.1000 కోట్ల క్లబ్లో చేరాడు. కాబట్టి ఈ ముగురి కాంబినేషన్ అంటే బిజినెస్‌కి బాగా హెల్ప్ అవుతుందని సమంతని సెలక్ట్ చేశారట. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.