ప్రభాస్ లైన్‌లో పెట్టి వరుస పాన్ ఇండియా చిత్రాల్లో ‘స్పిరిట్’ ఒకటి. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాలే కానీ.. ఈ మూవీ గురించి ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించనుడంతో ఏ రేంజ్‌లో సినిమా ఉండబోతుందా అని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ‘యానిమల్’ మూవీ ఇందుకు కారణం. ఈ మూవీలో సందీప్ డైరెక్షన్ కి వందకి వంద మార్కులు పడ్డాయి. రణ్ బీర్ చూపించిన విధానం కి ప్రేక్షకులు ఫిదా అయ్యరు. అలాంటి ప్రభాస్‌ని ఇంకే రెంజ్‌లో చూపిస్తాడో అనే ఆరాటంలో ఉన్నారు ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఏ క్షణమైనా ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే..
ఈ మూవీలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్, అలియాభట్, రష్మిక మందన్నతో పాటు పలువురు పేర్లు వినిపించాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎవరికీ ఖరారు చేయలేదు. తాజాగా దీపికా పడుకోన్ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు ఈ సినిమా కోసం ఆమె రూ.20కోట్ల భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందని, మేకర్స్ కూడా అంతమొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ప్రభాస్-దీపికా కలిసి నటించగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం సాధించింది.