యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ ఇంపార్టెంట్, పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన అజయ్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పొట్టేల్’ అక్టోబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మంగళవారం (అక్టోబర్ 29) దీపావళి సెలవు సినిమాకి అడ్వాంటేజ్ కానుంది.
Konda Surekha Lawyer: నాగార్జునకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తాం!
రిలీజ్ డేట్ పోస్టర్ యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, వారి కుమార్తె ఇంటెన్స్ ఫేస్ లతో ప్రజెంట్ చేసింది. మరో పార్ట్ లో హీరోని గ్రామస్తులు వెంబడి స్తున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. టీజర్ స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.