టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఒక్కప్పుడు చక్రం తిప్పింది పూజా హెగ్డె. కెరీర్ బిగినింగ్ లోనే తన అందం,నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది ఈ చిన్నది. మధ్యలో ఇక్కడ అవకాశాలు తగ్గడం వరుస అపజయాలు ఎదురవ్వడంతో బాలీవుడ్ లోకి జంప్ అయిన ఈ ముద్దుగుమ్మ. అక్కడ కూడా కొంత నిరాశే చవి చూసింది. కానీ ప్రజంట్ తమిళ, హింది భాషలో వరుస ప్రజెక్ట్‌లు లైన్ లో పెట్టించి పూజ. ఇదిలా ఉంటే మనకు తెలిసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కామన్. దీనికి ఎవరూ మినహాయింపుగా నిలవడం లేదు. కొందరు ఫాలోయింగ్ కోసం, మరికొందరు అదో రకమైన పైశాచిక ఆనందం తో ఇలా రకరకాల కారణాల వల్ల ఆన్ లైన్‌ని ఒక చెత్తబుట్టగా మార్చేస్తున్నారు. అయితే స్టార్ హీరోలు, హీరోయిన్‌లు వీటిని పెద్దగా పట్టించుకోరు.కానీ గ్రౌండ్ లెవెల్‌లో అభిమానులు చేసుకునే ట్రోలింగ్ వార్ మహా దారుణంగా ఉంటుంది. దీని బారిన పడిన హీరోయిన్ లు కూడా చాలా మంది ఉన్నారు. అందులో పూజా హెగ్డే కూడా ఒకరు. అవును ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీని గురించి స్పందించింది.
Also Read: Majaka : ‘మజాకా’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్..
‘ నేను సాధారణంగా కొన్ని పిచ్చి విషయాలు పట్టించుకోను. కానీ అదే పనిగా నా పై వచ్చేసరికి ట్రోల్స్ చూసి తట్టుకోలేక పోయాను. వెంటనే నా టీమ్ తో నను ట్రోల్ చేస్తున్న పేజెస్ గురించి కనుక్కోమని చెబితే, అప్పుడు షాకింగ్ విషయాలు కొన్ని తెలిశాయి. వెనుక నుండి కొందరు డబ్బులిచ్చి మరీ ట్రోలింగ్ చేయిస్తున్నా సంగతి బయట పడింది. అంతే కాదు ఒకవేళ వాటిని ఆపాలంటే ఎంత మొత్తం ఖర్చవుతుందో కూడా ముందే చెప్పేస్తున్నారు. అంటే చేయడానికి ఒక రేటు, చేసింది ఆపడానికి ఒక రేటు. ఈ వ్యాపారమే దో బాగుంది కదా. అలాని ఉత్తి పుణ్యానికి డబ్బులు ఇచ్చుకుంటూ పోలేం కదా’ అని తెలిపింది.