టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘మజాకా’. రీతూ వర్మ హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ లో అజయ్, మురళీ శర్మ, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, రఘుబాబు, సుప్రీత్ రెడ్డి, గగన్ విహారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హాస్య ఎంటర్టైన్మెంట్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని రాజేష్ దండ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న రిలీజై థియేటర్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా తండ్రి కొడుకులుగా సందీప్ కిషన్ , రావు రమేష్ నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అన్షు కూడా తన నటనతో పాత రోజులు గుర్తు చేసింది. ఇక నవ్వుల బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
Also Read: Thaman : ఉప్పల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ ఈవెంట్..
ఉగాది సందర్భంగా ఈ చిత్రం మార్చి 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆల్రెడీ జీ5లో రీసెంట్‌గానే సంక్రాంతికి వస్తున్నాం, మ్యాక్స్, కుడుంబస్తన్ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా దూసుకుపోతోన్నాయి. ఇక వాటితో పాటుగా ఈ సినిమా కూడా జీ5 వీక్షకులకు ఉగాది పండుగకు వినోదం పంచుతుంది. ఈ విషయాన్ని స్వయంగా జీ5 అధికారికంగా ప్రకటించింది.