Divyendu Sharma: ‘పెద్ది’ విలన్‌కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divyendu Sharma: టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ఖాతాలో మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో ‘రామ్‌బుజ్జి’గా నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన దివ్యేందు.. ఇప్పుడు మరొక క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (#AK47) చిత్రంలో దివ్యేందు శర్మ ఒక కీ రోల్లో నటించనున్నట్లు సమాచారం.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వెంకీ – త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతుండటంతో బిజినెస్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ హాట్ కేకులా మారింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో దివ్యేందు శర్మ క్యారెక్టర్ మేకర్స్ కథను మలుపు తిప్పే విధంగా డిజైన్ చేశారట. ఈ భారీ చిత్రాన్ని రాబోయే విజయదశమి (దసరా) పండుగ కానుకగా థియేటర్లలోకి గ్రాండ్‌గా తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు సమాచారం. ‘పెద్ది’ తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్‌బుజ్జి క్రేజ్, ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. దివ్యేందు రోల్‌పై తర్వలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!