హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుజిత్ తాలూకు కలను తమన్ నిజం చేశాడు. వీళ్లిద్దరూ ఎంత కలిసి పని చేశారంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రిప్ లోకి వెళ్లి, దానిలోకి నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే, నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని ఈరోజు మర్చిపోయాను. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే ఎవరైనా ఊరుకుంటారా? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది, కానీ ఇది ఖుషి లో నేను ప్రాక్టీస్ చేసిన కటానా”. ఇది చూసి, నాకు కావాలని దీని చుట్టూ ఒక కథ అల్లి, సినిమాని మీకు అలంజింపచేసేలా యాక్షన్ కట్ కానీ, స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశాడు సుజిత్.
Also Read : Pawan Kalyan: సుజిత్ చేసిన పనికి సినిమా బట్టల్లో వచ్చా
డీఓపీ రవిచంద్రన్ గారు, క్లాసిక్ విజువల్స్ తో మనోజ్ పరమహంస గారు ఇద్దరూ కలిసి చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకరు, సువ్వి సువ్వి పాట విన్నారు కదా, ప్రియాంక అరుణ్ మోహన్ 80లలో అమ్మాయిగా చాలా అద్భుతంగా నటించింది. ఒక సినిమా కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారనేది నేను ఖుషి ఎప్పుడో చూశాను. అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్‌కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదు అని నాకు అనిపిస్తోంది. అరే, మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది, ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్‌లో కొట్లాడుతున్నానంటే మీరు ఇచ్చిన బలం కదా. కానీ, సినిమా విషయానికి వస్తే నేను ఇప్పటికీ సినిమా వాడిని, సినిమా ప్రేమికుడిని, సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండదు. రాజకీయం చేసేటప్పుడు రాజకీయం తప్ప వేరే ఆలోచన ఉండదు. సినిమా చేస్తున్నప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి అనేది మాత్రమే తెలుసు. నాకు జపనీస్ రాదు కానీ, నన్ను పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు.