హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుజిత్ తాలూకు కలను తమన్ నిజం చేశాడు. వీళ్లిద్దరూ ఎంత కలిసి పని చేశారంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రిప్ లోకి వెళ్లి, దానిలోకి నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే, నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని ఈరోజు మర్చిపోయాను. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే…
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను చూసిన అభిమానులు అందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో కేరింతలు కొట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సుజీత్ చేసిన పనికి తాను సినిమాలో వాడిన బట్టల్లోనే ఈవెంట్‌కి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో ఫోటోలకు పోజులిస్తూ, కత్తితో నిలబడుతూ, కాసేపు అలా కూర్చుంటూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.