నేచురల్ స్టార్ హీరోగా ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. హిట్ 3 కారణంగా డిలే అవుతూ వచ్చిన ది ప్యారడైజ్ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది.
Also Read : Deva Katta : ‘మయసభ’.. బోలెడన్ని ప్రశంసలు.. కొన్ని విమర్శలు
తాజాగా ఈ సినిమాలో నుండి నేచురల్ స్టార్ నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. రెండు పొడవాటి జడలు వేసుకుని రగ్గుడ్ లుక్ లో నాని అదరగొట్టాడు. అలాగే ఈ సినిమాలో నాని పేరు ‘జడల్’ అని కూడా ప్రకటించారు మేకర్స్. పోస్టర్ చూస్తుంటేనే హడల్ పుట్టించేలా ఉన్నాడు నాని. నేచురల్ స్టార్ కాస్త మోస్ట్ వైలెంట్ స్టార్ గా మారిపోయాడు నాని. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగె కథనంతో ఈ సినిమా రాబోతుంది. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోందట. శ్రీకాంత్ ఓదెల రెండవగా వస్తున్న ది ప్యారడైజ్ తో నేచురల్ స్టార్ నానిని నెవర్ బిఫోర్ అనే స్థాయిలో చూపిస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తమిళ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ప్యారడైజ్ పాన్ ఇండియా భాషలలో రాబోతుంది. సమ్మర్ కానుకగ వచ్చే ఏడాది మార్చి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ది ప్యారడైజ్.