Olympic Games Paris: పారిస్ ఒలింపిక్స్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..రైమ్‌లతో పి.వి.సింధు ఆత్మీయ కలయిక
- అట్టహాసంగా ప్రారంభమైన 2024 పారిస్ ఒలింపిక్స్
- పారిస్ ఒలింపిక్స్‌లో కొణిదల ఫ్యామిలీ సందడి
- పి.వి.సింధుకు మెగా అభినందలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ 2024 అట్టహాసంగా ప్రారంభమైంది. అథెట్లు, సెలబ్రిటీలు పంచుకునే ఆత్మీయ క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బాడ్మింటన్ సెన్సేషన్ పి.వి.సింధు, రామ్‌చరణ్ పెంపుడు కుక్క బ్రాట్ మధ్య ఆహ్లాదకరమైన, ఆత్మీయమైన కలయిక జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ కలయిక అభిమానులతో సహా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
చిరంజీవి, సురేఖ దంపతులతో కలిసి రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన దంపతులు పారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ఈ ఒలింపిక్స్‌లో వీరు సందడి చేయటం గ్లామర్ టచ్‌నిచ్చింది. రామ్ చరణ్, ఉపాసనల కుమార్తె క్లీంకార ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనలేదు. అయితే పారిస్ సిటీలో మాత్రం క్లీంకార, రైమ్‌లు కుటుంబంతో కలిసి సందడి చేశారు.
Also Read
పారిస్‌లో రామ్ చరణ్, రైమ్‌లతో బాడ్మింటన్ సెన్సేషన్ పి.వి.సింధు కలిశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. చరణ్, రైమ్‌లను సింధు కలిసినప్పుడు వారు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అలాగే రైమ్‌ను ముద్దులాడుతూ సింధు అపూరమైన సమయాన్ని గడిపారు. ఈ వీడియోతో పాటు సింధు ఆటతీరుని ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచుల్లో అద్భుతంగా రాణించాలని కోరుతూ రైమ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈఫిల్ టవర్ దగ్గర గడిపిన అద్భుతమైన క్షణాలను ఫొటో రూపంలో షేర్ చేశారు. అలాగే పారిస్ సిటీలో తన వ్యక్తిగతమైన అనుభవాన్ని ఆయన తెలియజేశారు. చరణ్ సతీమణి ఉపాసన విషయానికి వస్తే, కుటుంబం అంతా ఒలిపింక్స్‌లో పాల్గొన్నప్పుడు ఆ అనుభవంతో పాటు అక్కడ గడిపిన క్షణాలను ఫొటోలు, వీడియోల రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒలింపిక్స్ లో పాల్గొనడం పట్ల తమ ఆనందాన్నితెలియజేయటంతో పాటు భారత బృందానికి శుభాకాంక్షలను అందించారు చిరంజీవి. ఈ క్రమంలో ఆయన సురేఖతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు.
Also Read: Tollywood: స్టార్ హీరో ముఖ్య అతిధిగా దర్శక సంజీవని మహోత్సవం కార్యక్రమం..
తాజావార్తలు
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
-
WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..