ప్రముఖ నటులు ఎన్టీఆర్, రిషబ్ శెట్టిల మధ్య సినిమా సహకారం గురించి కొన్ని నెలలుగా అనేక కథనాలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి ఉన్నారా? లేదంటే ‘కాంతార చాప్టర్ 1’లో ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని తేలింది. నిజానికి, ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1’లో ఎన్టీఆర్ ఒక గెస్ట్ అప్పీరియెన్స్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read:Nalgonda : నాల్గొండలో విద్యార్థి సంఘాల ఆగ్రహం ప్రైవేట్ కాలేజీలపై మండిపడ్డ నేతలు
గతంలో, ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి కర్ణాటకకు వెళ్లినప్పుడు వారిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఉడిపిలోని శ్రీకృష్ణ టెంపుల్, కొల్లూరులోని మూకాంబిక టెంపుల్స్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో రిషబ్ శెట్టి స్వయంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని రిసీవ్ చేసుకున్నారు. అలాగే, ప్రతిచోటా ఎన్టీఆర్‌తోనే రిషబ్ శెట్టి ఉన్నట్లు కనిపించారు. మీడియా ప్రతినిధులు ఎన్టీఆర్‌ను ‘కాంతార’ ప్రీక్వెల్‌లో నటిస్తున్నారా అని అడిగినప్పుడు, “రిషబ్ ప్లాన్ చేయాలి, చేస్తే నటించడానికి నేను రెడీ” అని నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ వ్యాఖ్యలు రిషబ్ శెట్టి సినిమాలో ఎన్టీఆర్ అతిథి పాత్ర పోషిస్తున్నారనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రావచ్చు.