Allu Arjun Team Member Revealed Facts behind rift of Sukumar vs Allu Arjun: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా గురించి గత కొద్దిరోజులుగా అనేక రకాల వార్తలు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ మాజీ విభేదాలు తలెత్తాయని అందుకే సుకుమార్ చెప్పినా వినకుండా అల్లు అర్జున్ గడ్డం చేయించాడని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ చేసిన పనికి హర్ట్ అయిన సుకుమార్ అమెరికా విహారానికి వెళ్లిపోయాడని సుకుమార్ వెళ్ళిపోయాడు అనే విషయం తెలిసి బన్నీ కూడా ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ కి వెళ్ళాడని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ మూడు యూనిట్లతో షూటింగ్ చేయించాలని కోరితే సుకుమార్ మాత్రం వినడం లేదని ఈ నేపథ్యంలోనే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇదే విషయం మీద అల్లు అర్జున్ డిజిటల్ టీంకి సంబంధించిన శరత్ చంద్ర అనే వ్యక్తి అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద క్లారిటీ ఇచ్చాడు.
Secret Room : నేడు తిరిగి తెరుచుకోనున్న పూరిలోని జగన్నాథస్వామి ఆలయం రహస్య గది
ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశాడు. సుకుమార్ గారు ఈ సినిమా ఎడిటింగ్ పని మొదలుపెట్టాడని, ఫస్ట్ పార్ట్ ఎడిటింగ్ చేస్తున్న నేపద్యంలో ఆయన బ్రేక్ తీసుకున్నాడని చెప్పుకొచ్చారు. ఎడిటింగ్ సమయంలో బ్రేక్ తీసుకోవడం చాలా కామన్ అని ఆయన అన్నారు. దానికి మరొక అభిమాని షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఒకసారి చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తే ఇప్పుడు టైం ఉంది ఫస్ట్ ఆఫ్ కంప్లీట్ చేసుకుని కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ అంతా రెడీ చేసి పెట్టుకుంటే మిగతా ఎడిటింగ్ షూటింగ్ అయినాక చేసుకోవచ్చు. హ్యాపీగా డిసెంబర్ 6వ తారీకున సినిమాని రిలీజ్ చేయొచ్చు అందుకే అలా చేసుకుంటూ ఉండవచ్చు అని కామెంట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ సుకుమార్ మంచి ఏర్పడిన విభేదాలు అంటూ జరుగుతున్న వార్తలకు అల్లు అర్జున్ టీం నుంచి క్లారిటీ వచ్చినట్లయింది.
Ippudu time undi. 1st half complete Chesukuni CG work antha ready pettukunte, remaining edit shoot aipoyaaka chesukunte December 6th happy ga vacheyyochu ga Karuna Thammudu.
— Sarath Chandra Naidu (@imsarathchandra) July 18, 2024