హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వంటి కథాంశంతో ఈ చిత్రం రానుంది. శ్రీ దేవి విజయ్ కుమార్ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
Also Read : Kingdom : కింగ్డమ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
వాస్తవానికి ఈ సినిమా గతేడాది సెప్టెంబరు 6న థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సినిమా గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో కాస్త గట్టిగానే చర్చించుకుంటున్నారు. సుందరకాండ చాలా బాగా వచ్చిందట. సత్య, నారా రోహిత్ కామెడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని పండగకు హాయిగా నవ్వుకునే సినిమా అవుతుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటరైనర్ గ తెరకెక్కించాడట. నారా రోహిత్ కు సాలిడ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ సుందరకాండ అని చర్చించుకుంటున్నారు. శ్రీ దేవి విజయ్ కుమార్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ మంచి స్టార్ట్ దొరుకుతుందని భావిస్తున్నారు. ఈ బుధవారం వినాయక చవితి కానుకగా 27న విడుదల అవుతోంది సుందరకాండ. మరి నారా రోహిత్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది మరి కొన్ని గంటల్లో తెలుస్తుంది.