బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన నిహారిక, తరువాత వెండితెరపై హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. వరుస ఫ్లాప్‌ల తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి, వ్యక్తిగత జీవితం పై దృష్టి పెట్టింది. ఇక పోతే వివాహ జీవితం ఎక్కువ కాలం సాగకపోవడంతో, భర్త చైతన్యతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన మెగా అభిమానులకు గట్టి షాక్‌గా మారింది. కొంతకాలం గ్యాప్ తర్వాత, నిహారిక మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఈసారి నటిగా కాదు, నిర్మాతగా. “కమిటీ కుర్రాళ్లు” పేరుతో తెరకెక్కించిన ఆమె తొలి చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.
Also Read : Kantara Chapter1: కనకవతి వచ్చేసింది.. కాంతార నుండి రుక్మిణి బ్యూటి ఫుల్ లుక్
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నిహారిక, ఇటీవల మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఒక మెసేజ్‌ను షేర్ చేసింది. పీరియడ్స్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సింపుల్ కానీ సెన్సిబుల్ సలహా ఇచ్చింది. “డియర్ లేడీస్.. మహిళల శరీరం అద్భుతమైనది. మన బాడీస్‌కి ఏం చేస్తున్నామో వాటికి తెలుసు. వాటి ఒకే ఒక్కటి – ప్రొటెక్ట్ చేయడం, హీల్ చేయడం. నెల మొత్తం మనం ఒకేలా ఉండం. హైయెస్ట్ హైస్, లోయెస్ట్ లోస్ అనుభవించడం సహజం. కాబట్టి, మీ బాడీ ఏం కోరుకుంటుందో అది ఇవ్వండి” అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నిహారిక ఈ సందేశం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా కనిపించే ఈ మాటల్లో, మహిళలు తమ శరీరాన్ని అంగీకరించి, ప్రేమించుకోవాలనే గొప్ప భావన దాగి ఉంది.