పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. Also Read:Dil Raju: పైరసీ చేసి చిన్న సినిమాకు 400, పెద్ద సినిమాకు…
నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికి అనుకునంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా మారిన ఆమె తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై 2024లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని, తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో ఎక్కువ మంది కొత్త వారే కావటం విశేషం.. అయినప్పటికి వారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా నిహారిక…