లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ మూవీ చేయాలని విఘ్నేశ్ శివన్ ఏ నిమిషంలో ఫిక్స్ అయ్యాడో కానీ సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తునే ఉన్నాయి. 2019లోనే శివకార్తీకేయన్‌తో తీయాలనుకున్నాడు. లైకా కూడా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చింది. కానీ బడ్జెట్ ఇష్యూ వల్ల సినిమా ఆగిపోయింది. అప్పట్లోనే విఘ్నేశ్ భారీ బడ్జెట్ చెబితే వెనక్కు తగ్గిందట లైకా. లైకా పోతే నేను తీయేలేనా అని ఫిక్సైన విఘ్నేశ్ మరో నిర్మాణ సంస్థతో కలిపి ఈ సినిమాకు దర్శకుడిగానే కాదు ప్రొడ్యూస్ చేసే బాధ్యతను తీసుకున్నాడు. శివకార్తీకేయన్ ప్లేసులోకి లవ్ టుడేతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ రీప్లేస్ చేశాడు. హీరోయిన్ కోసం.. ప్రియాంక మోహన్, జాన్వీని అనుకుంటే.. కృతి శెట్టి ఫైనల్ అయ్యింది.
Also Read : Bollywood : ఆషికీ 3పై షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన డైరెక్టర్ మోహిత్ సూరి
గత ఏడాది జనవరిలో స్టార్టైన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుమ్మడికాయ కొట్టేశారు. తండ్రి, కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడట విఘ్నేశ్ శివన్. సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతుందని కూడా ఎనౌన్స్ చేశారు మేకర్స్. నయన్ తారను వివాహం చేసుకున్నాక విఘ్నేశ్ శివన్ నుండి వస్తోన్న ఫిల్మ్ ఇది. అందుకే చాలా ప్రెస్టిజియస్‌గా తీసుకున్నాడు డైరెక్టర్. అటు నిర్మాతగా ఈ ఇద్దరికీ చాలా కీలకం. కానీ సెప్టెంబర్ 18 సినిమా రాదన్న బజ్ గట్టిగానే వినిపిస్తోంది. దీనికి కారణం కూడా విఘ్నేశ్ అన్నదే టాక్. సినిమాకు ముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు చేయించాడట డైరెక్టర్. దీంతో మరో నిర్మాణ సంస్థతో చిన్న ఇష్యూ నడుస్తుందన్న సమాచారం. ఈ ఇష్యూ వల్లే పోస్టు ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతుందని తెలుస్తోంది. ఈ సమస్య సాల్వ్ చేసుకుని నెక్ట్స్ ఇయర్ వాలంటైన్స్ డేకి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట మేకర్స్.