నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నాని నటించిన దసరా, హాయ్ నాన్న సినిమాల దర్శకులు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ డైరక్టర్లుగా అవార్డులు అందుకోవడంతో పాటు, దసరా చిత్రంలో అద్భుత నటనకు నాని బెస్ట్ హీరోగా అవార్డు అందుకుని ఆ ప్రౌడ్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
Also Read: Ott Movies : ఈ వారంలో ఓటీటీలోకి రానున్న సినిమాలు ఏవంటే..?
ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు నేచురల్ స్టార్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ ఆగస్టు 15న స్వాతంత్‌ర్య దినోత్సవం సందర్భంగా యూసఫ్ గూడ ఫస్ట్ బెటాలియన్ పోలీసులతో సరదగా ముచ్చటించారు. పోలీసుల ప్రశ్ననలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు నాని. ఇందులో భాగంగా Ntv యాంకర్ నానిని ‘మీరు ఇప్పటి వరకు క్లాస్, మాస్ సినిమాలు చాలా చేసారు, సరిపోదా శనివారం సినిమాలో విలన్ పోలీస్ క్యారక్టర్ చేస్తున్నాడు, మరి హీరోగా పోలీస్ క్యారక్టర్ లో ఎప్పుడు కనిపిస్తారని’ నానిని ప్రశ్నించారు. ఈ ఆసక్తికర ప్రశ్నకు సమాధానం ఇస్తూ నాని చేయబోయే తర్వాతి సినిమా అప్ డేట్ ఇచ్చాడు. నాని మాట్లాడుతూ “ ఈ నెల 29న నా సరిపోదా శనివారం రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ అయినా సరిగ్గా 4 లేదా 5 రోజుల తర్వాత నా నెక్ట్స్ సినిమా అనౌన్స్ మెంట్ చేద్దాం అని అంతా రెడీ చేసాను. కాని ఇప్పుడు ఇంత కంటే మంచి సందర్భం రాదు, నా తరువాతి సినిమాలో నేను పోలీస్ గా నటిస్తున్నాను” అని తెలిపాడు. HIT ఫ్రాంచైజ్ లో భాగంగా HIT -3 లో శైలేష్ కొలను దర్శకత్వంలో నటిస్తున్నాడు నాని.