Vrushakarma: ‘కింగ్ 100’లో నాగచైతన్య గెస్ట్ రోల్? ఒక్క మాటతో హింట్ ఇచ్చేసిన చైతూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vrushakarma: నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’పై అక్కినేని ఫ్యాన్స్‌లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్పెషల్ మూవీలో నాగచైతన్య కూడా ఓ చిన్న పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ కొద్దిరోజులుగా గట్టిగానే వినిపిస్తోంది. తాజాగా ఈ రూమర్స్‌పై చైతూ స్పందించిన తీరు చూస్తుంటే, ఆ వార్త నిజమేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన మిస్టిక్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ప్రెస్ మీట్లో ‘కింగ్ 100’ క్యామియో గురించి మీడియా ప్రతినిధులు చైతన్యను అడిగారు. దీనికి ఆయన నవ్వుతూ.. “కింగ్ 100 గురించి స్వయంగా కింగ్ చెప్పాలి. నేనిప్పుడే ఏదైనా చెప్పి ఆ సస్పెన్స్‌ను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు” అంటూ తెలివిగా దాటవేశారు. ఒకవేళ ఆ సినిమాలో తను లేకపోతే ‘లేదు’ అని డైరెక్ట్‌గా చెప్పేవారు. కానీ సస్పెన్స్ పోతుందని అనడంతో, తండ్రి వందో సినిమాలో చైతూ మెరవడం పక్కా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఇదే సమయంలో తన నెక్స్ట్ సినిమాల గురించి కూడా చైతూ క్లారిటీ ఇచ్చారు. హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలని ఆడియన్స్ కోరుకుంటున్నారని, ప్రస్తుతం తన ఫోకస్ అంతా ‘వృషకర్మ’ రిలీజ్ మీదే ఉందని చెప్పారు. డిసెంబర్ 4న ఈ సినిమా విడుదలైన వెంటనే తన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తానని, త్వరలోనే షూటింగ్ కూడా మొదలుపెడతానని తెలిపారు. మరోవైపు, డైరెక్టర్ కార్తీక్ దండు తన సినిమాల్లో పక్షులు, జంతువులను భయపెట్టేలా చూపించడం వెనుక ఉన్న లాజిక్‌ను బయటపెట్టారు. ‘విరూపాక్ష’లో కాకులను వాడిన ఆయన, ఇప్పుడు ‘వృషకర్మ’లో గబ్బిలాలను హైలైట్ చేయడంపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. “ప్రకృతిలో ఏదైనా విపత్తు జరగబోతుంటే మనుషుల కంటే ముందే పశుపక్ష్యాదులు ఆ వైబ్రేషన్స్‌ను పసిగడతాయని అంటారు కదా. నేను ఎంచుకునే కథల్లో అతీంద్రియ శక్తులు, మిస్టరీ అంశాలు ఉంటాయి. ఏదో జరగబోతోందనే ఒక బ్యాడ్ ఒమెన్ లాగా, సినిమా మూడ్‌ను ఇంకాస్త ఎలివేట్ చేయడానికే ఇలాంటి ఎలిమెంట్స్ వాడుతుంటాను” అని కార్తీక్ దండు చెప్పుకొచ్చారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాపై మొదటి నుంచీ మంచి బజ్ ఉంది. మరి డిసెంబర్ 4న ‘వృషకర్మ’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Vrushakarma: ‘కింగ్ 100’లో నాగచైతన్య గెస్ట్ రోల్? ఒక్క మాటతో హింట్ ఇచ్చేసిన చైతూ!
-
Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో విషాదం.. పాఠశాల పక్కన భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థులు మృతి..
-
Kaka Vs Viswambhara: ‘కాకా’ ఓకే.. ‘విశ్వంభర’ చప్పుడు లేదేంటి బాసూ..!
-
Veera Siva Reddy: కడప రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబు, లోకేష్‌పై బీజేపీ నేత హాట్ కామెంట్స్!
-
Ram Charan : టైర్ వన్ హీరోల్లో రామ్ చరణ్‌కి నచ్చే క్వాలిటీస్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!