Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’

Mythri Ravi

Mythri Ravi

Mythri Ravi: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్‌ తెచ్చుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సంతోషంలో తాజాగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని, ఆయనకు ఇచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు.

“ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ గారి ‘డ్రాగన్’ షూటింగ్ జరుగుతోంది. అంతకుముందు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు.. ‘రణబాలి’ సినిమాకు అదిరిపోయే రిపోర్ట్ పట్టుకునే మీ దగ్గరికి వస్తాం సార్ అని తారక్ గారికి చెప్పాం. ఆయనకు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి ఆర్ఎఫ్‌సీకి వెళ్లి, స్వయంగా ఎన్టీఆర్ గారిని కలిసి ఈ హిట్ రిపోర్ట్ చెప్పబోతున్నాం. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం” అంటూ రవిశంకర్ ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చారు.

ఓవైపు విజయ్ దేవరకొండతో తీసిన ‘రణబాలి’ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం, మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూట్ జోరుగా సాగుతుండటంతో మైత్రీ నిర్మాతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రెస్‌మీట్ నుంచి నేరుగా తారక్ సెట్‌కు హిట్ రిపోర్ట్‌తో వెళ్తున్నామని రవిశంకర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.