మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని కూడా అనుకున్నారు. అయితే గేమ్ చేంజర్ కారణంగా ఆ నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో తమ సినిమా వాయిదా వేసినట్లు దసరా సమయంలో నిర్మాతలు ప్రకటించారు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయి దాదాపు ఆరేడు నెలలు పూర్తవుతుంది.
Also Read : Pawan Kalyan: పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం
ఇప్పటికీ విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాలో ఎవరూ ఊహించని విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని తెలుస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఒక ఇండియన్ సినిమా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Also Read : Prabhas: ప్రభాస్ కాలికి ‘ఫౌజీ’ షూట్లో గాయం.. అసలేమైందంటే?
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్‌లా ఉండబోతుందని అంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌కి చెందిన టాప్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రస్తుతానికి ఈ సినిమా కోసం పని చేస్తున్నాయి. ప్రేక్షకులకు ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఫైనల్ ప్రొడక్ట్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంత ఆలస్యంగా వచ్చినా వర్త్ వర్మా వర్తు అనేలా ఈ టీమ్ సినిమాని సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.