నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. గత కొన్నాళ్లుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తూ వచ్చిన బాలయ్య ఎట్టకేలకు గతేడాది మోక్షజ్ఙ ఎంట్రీ గురించి అధికారికంగా ప్రకటించారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు మోక్షుని లాంచ్ చేసే బాధ్యత అప్పజెప్పాడు బాలయ్య. అందుకు తగ్గట్టే మోక్షజ్ఙ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక షూటింగ్‌కు వెళ్లడమే లేట్ పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్ చేశారనే వార్తలు వచ్చాయి. కానీ సడెన్‌గా అన్నింటికి బ్రేక్ పడిపోయింది.
Also Read : RAPO 22 : రైటర్ గా మారిన రామ్ పోతినేని
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. దానికి తోడు ప్రశాంత్ వర్మకు ప్రభాస్ ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా అయినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే అధికారక ప్రకటన కూడా రానుందని టాక్. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందనే చర్చ అయితే జరుగుతోంది. దీంతో ఈ ఏడాదిలో మోక్షు ఎంట్రీ ఉంటుందని గట్టిగా నమ్మిన బాలయ్య అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. బాలయ్య వారసుడి ఎంట్రీ అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. బాలయ్య కూడా మోక్షుని పక్కా ప్లానింగ్‌తో లాంచ్ చేయాలని చూస్తున్నాడు. కానీ మొదటి సినిమాకే ఇలా అయితే ఎలా అంటూ నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే ఇంత జరుగుతున్న కూడా మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు. మరి బాలయ్య ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి