ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. తన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమాతో తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read : Pavani Karanam : లేటెస్ట్ ఫొటోస్ తో రచ్చ లేపిన పుష్ప రాజ్ చెల్లెలు
ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మార్చి 15 జరిగే ఈ షూట్ లో కీలకమైన సీన్స్ షూట్ చేయనున్నారు మేకర్స్. కాగా ఈ సినిమాతో రామ్ రైటర్ గా మారాడు. ఈ సినిమాలో సందర్భానుసారం వచ్చే ప్రేమ గీతాన్ని రామ్ పోతినేని స్వయంగా రాసాడట. పాట చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ప్రామానిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. గతంలోను రామ్ నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్ గాను ఫైట్స్ కంపొజిషన్ లోను తన ప్రతిమను నిరూపించుకున్నాడు. మరి ఇప్పుడు పాటల రచయితగ మారిన రామ్ రచించిన సాంగ్ ఎలా ఉండబోతుందని Rapo ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.