నిన్నటి నుంచి పరారీలో ఉన్నారంటూ, లేదు అజ్ఞాతంలో ఉన్నారంటూ రకరకాల ప్రచారం జరుగుతున్న మోహన్ బాబు ఎట్టకేలకు ట్వీట్ ద్వారా తాను పరారీలో లేనని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోలీసులకు సైతం మోహన్ బాబు అందుబాటులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాను అనారోగ్యంతో ఉన్నానని, కాబట్టి కోలుకున్న తర్వాత విచారణ చేయాలని మోహన్ బాబు కోరినట్లుగా తెలుస్తోంది. అయితే అలా కుదరదని విచారణకు సహకరించాలని పోలీసులు కోరినట్లుగా తెలుస్తోంది. సరే అంటూ పోలీసుల విచారణను మోహన్ బాబు ఎదుర్కొంటున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి మోహన్ బాబుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక మోహన్ బాబు లైసెన్సుడ్ గన్ ని సరెండర్ చేయాలని కూడా పోలీసులు మోహన్ బాబుని కోరినట్లుగా తెలుస్తోంది.
Allu Arjun: అల్లు అర్జున్ నివాసానికి కన్నడ సూపర్ స్టార్
అయితే ఈ రోజు సాయంత్రం ఆ గన్ సరెండర్ చేస్తానని పోలీసులకు మోహన్ బాబు సమాచారం ఇచ్చారు. గత కొద్ది రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. ముందుగా మంచు మనోజ్ మంచు మోహన్ బాబు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత మోహన్ బాబు నివాసం బయట బౌన్సర్లను ఏర్పాటు చేయటం తాను పోటీగా మనోజ్ కూడా కొంతమంది బౌన్సర్లను తీసుకెళ్లి మోహన్ బాబు నివాసం వద్ద హడావుడి చేయడం మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే మీడియా ప్రతినిధులు మోహన్ బాబు వివరణ కోరే సమయంలో మోహన్ బాబు సంయమనం కోల్పోయారు. మీడియా ప్రతినిధి మీద దాడికి దిగారు. దానిపై హత్యాయత్నం కేసు నమోదైంది.