Chiranjeevi- Alai balai: నిన్న మెగాస్టార్ చిరంజీవితో హర్యారా గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమాపై దత్తాత్రేయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్‌ఫాదర్ హిట్ కావడం సంతోషంగా ఉందన్నారు. నటుడిగా గొప్ప విలువలు వున్న వ్యక్తి చిరంజీవి అని గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు జరిగే అలయ్ బలయ్ కార్యక్రామానికి మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బండారు దత్తాత్రేయ ప్రత్యేకంగా ఆహ్వానించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దాదాపు 17 ఏళ్ల నుంచి నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈవేడుకకు మెగాస్టార్ చిరంజీవి, జననేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు సమాచారం. దీంతో మెగా, పవన్ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారీగా మోగా అభిమానులు నాంపల్లి ఎగ్జిబిషన్ ను చేరుకున్నారు. పది గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సందడి వాతావరణం కనిపించింది. దీంతో పోలీసులు అధికారులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులతో సహా 9 మంది మృతి
ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం హాజరుకానున్నట్లు సమాచారం. ఇక.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, జి. కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, భగవత్ మాన్ సింగ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మెహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు విశ్వనీయ సమాచారం.
అయితే.. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. కాగా.. ఈసారి మాత్రం దీనికి కాస్త రాజకీయ ప్రాధాన్యత ఏర్పడినట్టే కనిపిస్తోంది. ఇక… వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోండటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం వంటి పరిస్థితుల మధ్య అలయ్ బలయ్ ఏర్పాటు కాబోతోండటం వల్ల అందరి దృష్టీ దాని మీదే ఉంది. ఇక.. హర్యారా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా చిరంజీవి కలిసి ప్రత్యేకంగా ఈకార్యాక్రమానికి ఆహ్వానించడంపై రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
Jio True 5G: 5జీలోనూ జియో సంచలనం.. అన్నీ ఫ్రీ… వారికి మాత్రమే..