ఒక స్టార్ హీరోయిన్‌గా నిరూపించుకోవాలి అంటే అంత ఈజీ కాదు. చిన్న పాత్ర పెద్ద పాత్ర అని చూసుకోకుండా వచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని సద్వీనియోగం చేసుకుంటూ.. ట్యాలెంట్ చూపించుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. ప్రజంట్ హీరోయిన్ మీనాక్షి కూడా అదే చేస్తోంది. ‘ఇచ్చట వాహనములు నిలుపురాదు’ చిత్రంలో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా మాస్ మహరాజ్ రవితేజతో ‘ఖిలాడీ’ లో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత ‘గుంటూరు కారం’లో మహేశ్‌బాబు మరదలిగా ప్రాధాన్యతలేని పాత్ర అయిన కూడా మహేష్ మూవీ అనే కారణంగా నటించిందట. అలా ‘లక్కీ భాస్కర్’తో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించింది.
Also Read : Pooja hegde : వరుసగా 7 ఫ్లాప్ లు పాపం ఇప్పుడు పూజ పరిస్థితి ఏంటీ..
కానీ అందం, అభినయం, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా కూడా ఎందుకో టాలీవుడ్ పెద్ద హీరోలు మీనాక్షిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇండస్ట్రీ హిట్టు కొట్టినా ప్రస్తుతం ఆమె చేతిలో చిన్న హీరోల సినిమాలే ఉన్నాయి. వరుసగా టాలీవుడ్‌లో బారీ బారీ ప్రాజెక్ట్‌లు అనౌన్స్ చేస్తున్నారు. కానీ ఎవ్వరు మీనాక్షి వైపు కూడా చూడటం లేదు. అయితే తాజాగా ఈ బామ్మ ఇప్పుడు బాలీవుడ్‌ల్లో తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘స్త్రీ’, ‘మిమీ’ లాంటి మంచి హిట్ చిత్రాలను నిర్మించిన దినేశ్ విజన్ రూపొందిస్తున్న ఓ ప్రాజెక్టులో మీనాక్షి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మీనాక్షి కోసం నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ ప్రత్యేకంగా కథను సిద్ధం చేస్తుందట. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్న ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా శక్తిమంతంగా ఉండనుంది. దీంతో మీనాక్షి ని దృష్టిలో పెట్టుకొని, తనకు సరిగ్గా సరిపోయే హీరోని వెతికే పనిలో పడిందట మూవీ టీం. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించనున్నారని మీనాక్షి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.