మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టేలా ఉన్నాడు రవితేజ అనే కామెంట్స్ వినిపించాయి.
Also Read : Megastar : కన్నడ నిర్మాణ సంస్థలో చిరు – బాబీ.. నేడు స్పెషల్ పోస్టర్ రిలీజ్
కాగా ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఈ నెల 27న రిలీజ్ కావాల్సి ఉంది. ఆ విషయాన్ని ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లోను ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ డేట్ కు రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు.ఈ సినిమా షూటింగ్ మరో వారం రోజులు పెండింగ్ ఉందట. మాంటేజ్ సాంగ్ ఒకటి కొంత ప్యాచ్ వర్క్ షూట్ పెండింగ్ ఉంది. ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్ ప్రకారం షూట్ ఫినిష్ కావాలి. కానీ కార్మిక సంఘాలు షూటింగ్స్ కు బంద్ ప్రకటించడంతో షూట్ పెండింగ్ ఉంది. నేటి నుండి కార్మిక సంఘాల బంద్ ముగియడంతో మాస్ జాతర షూటింగ్ స్టార్ట్ చేసారు. చక చక షూటింగ్ చేసేలా షెడ్యూల్ వేశారు. ఇక ఈ నెలలో రిలీజ్ వాయిదా వేసి సెప్టెంబర్ 12న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. నేడో రేపో అఫీషియల్ గా ప్రకటన కూడా రాబోతుంది. కానీ అదే రోజు కిష్కింద పురి, కాంత కూడా రిలిజ్ కు రెడీ గా ఉన్నాయి.