రజనీకాంత్, మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ముమ్మాటీ, శోభన రజనీ కలిసి నటించిన కాసుల వర్షం కురిపించింది. అంతటి సూపర్ హిట్ తర్వాత రజనీ, మణి కాంబోలో సినిమా రాలేదు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును దళపతి 1991లో రిలీజ్ అయింది అంటే నేటికీ దాదాపు 33 ఏళ్లు వీరు మళ్ళి కలవలేదు. ఆ సంగతి అటుంచితే ఈ బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి కలవనుందని తెలుస్తుంది. ఇప్పటికే రజనీకాంత్, మణిర త్నంకు మధ్య కథ చర్చలు జరిగాయని టాక్ నడుస్తోంది.
Also Read : Tollywood : తెలుగు ప్రేక్షకులను కాదు.. తెలుగు భాషను అగౌరవిస్తున్నారు..?
ప్రస్తుతం రజనీ నటించిన ‘వెట్టయన్ అక్టోబరు 10న రిలీజ్ కు రెడీ గా ఉంది. మరోపక్క లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సెట్స్ ఫై ఉంది. వీటితో పాటు నెల్సన్ డైరెక్షనల్ లో ‘జైలర్ 2’ చేయాల్సి ఉండనే ఉంది. ఇవే కాకుండా మారి సెల్వరాజ్, అధిక్ రవించంద్రన్ కూడా రజనీతో సినిమా చేసేందుకు కథలు రెడీ చేసారు. మరి మణిరత్నంతో సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ బర్త్ డే రోజు ఈ సినిమా ను ప్రకటించే అవకాశముందని తెలిసింది అటు మణిరత్నం కమల్ హాసన్, శింబు కాంబోలో తెరకెక్కిస్తున్న ‘థగ్ లైఫ్’ షూటింగ్ ఇటీవల ముగించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. మణిరత్నం కమల్ కాంబోలో ‘నాయకన్ (1987) విజయం తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.