మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ కన్నప్ప…ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందుతుంది .ఈ సినిమాలో మంచు విష్ణు “కన్నప్ప”గా కనిపించనున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా కన్నప్ప మూవీ నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు..ఈ పోస్టర్ లో మంచు విష్ణు జలపాతం నుంచి కనిపిస్తూ బాణంతో ఎక్కుపెడుతున్నట్లు గా వుంది .ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.కన్నప్ప మూవీలో మోహన్ లాల్ , ప్రభాస్ ,అక్షయ్ కుమార్ వంటి బిగ్ స్టార్స్ నటించబోతున్నారు .దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి.మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఒకవైపు మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు హీరోగా విష్ణు రాణిస్తున్నాడు .
ఇదిలా ఉంటే మంచు విష్ణు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు .మంచు విష్ణు మాట్లాడుతూ టాలీవుడ్ లో సీనియర్ హీరోల చిత్రాలు కొన్ని రీమేక్ చేయాలని ఉన్నట్లు తన మనసులో మాట బయట పెట్టాడు. నాకు భైరవద్వీపంలో బాలకృష్ణ గారి పాత్ర అంటే ఎంతో ఇష్టం. ఆ పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. ఆ చిత్రంలో బాలకృష్ణ గారు ఎంతో అద్భుతంగా నటించారు. అవకాశం వస్తే ఆ పాత్రలో నటించాలని వుంది అని విష్ణు తెలిపారు ..అలాగే నాన్నగారి చిత్రాల్లో అల్లుడుగారు , అసెంబ్లీ రౌడీ వంటి చిత్రాలు రీమేక్ చేయాలని ఉందని తెలిపారు.అలాగే నాగార్జున గారు నటించిన అన్నమయ్య , వెంకటేష్ గారు నటించిన చంటి అంటే ఎంతో ఇష్టమని విష్ణు తెలిపారు.ఇక చిరంజీవి గారు , కె విశ్వనాథ్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలంటే తనకు పిచ్చ ఇష్టమని విష్ణు తెలిపారు .వారి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా ఒక అద్భుతమని విష్ణు తెలిపారు.అలాంటి చిత్రాలు రీమేక్ చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని విష్ణు తెలిపారు ..