ఇండియన్ సినీ ఇండస్ట్రీలో యానిమేషన్ సినిమాలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రం ‘మహావతార్ నరసింహ’. దర్శకుడు అశ్విన్ కుమార్ తన సృజనాత్మకత, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఊహించని స్థాయిలో హిట్ సాధించిన ఈ చిత్రం, రికార్డు వసూళ్లు సాధించి యానిమేషన్ సినిమాల స్థాయిని మరింత పెంచింది. ఇప్పటికీ ఈ చిత్రం సాలిడ్ రన్‌ను కొనసాగిస్తుండటమే దీని విజయానికి నిదర్శనం. ఇలాంటి విజయం తర్వాత ప్రేక్షకులు, అభిమానుల్లో తదుపరి ప్రాజెక్టులపై అంచనాలు పెరిగాయి. ఆ క్రమంలో మేకర్స్ నుంచి వచ్చే మరో క్రేజీ ప్రాజెక్ట్ “మహావతార్ పరశురామ”.
Also Read :Sreeleela : నా టాపిక్ చెబితే.. మీ మ్యాటర్ బయటపెడతా – జగపతిబాబుకు శ్రీ లీల వార్నింగ్!
పురాణాల్లో భయంకర వీరుడిగా, పరాక్రమ శాలి అవతారంగా నిలిచిన పరశురాముడి గాథను యానిమేషన్ రూపంలో చూపించబోతుండటంతో ఈ సినిమాపై అద్భుతమైన హైప్ నెలకొంది. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ నెల నుంచి ఈ ప్రాజెక్ట్ రంగంలోకి దిగబోతుందట. అంటే మరి కొన్ని నెలల్లోనే ‘మహావతార్ పరశురామ’ ప్రాజెక్ట్ ఆరంభం కానుంది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, మ్యూజిక్, టెక్నికల్ వర్క్ విషయంలో కూడా క్రియేటివ్ టీమ్ భారీ స్థాయి ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘నరసింహ’తోనే ఇండియన్ ఆడియెన్స్‌కు గ్లోబల్ లెవెల్ అనుభూతి ఇచ్చిన అశ్విన్ కుమార్, ఇప్పుడు ‘పరశురామ’ అనే పవర్ఫుల్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమా ఎలా రూపుదిద్దుకుంటుందో, ఏ స్థాయిలో విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందో చూడాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.