ఇండియన్ సినీ ఇండస్ట్రీలో యానిమేషన్ సినిమాలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రం ‘మహావతార్ నరసింహ’. దర్శకుడు అశ్విన్ కుమార్ తన సృజనాత్మకత, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఊహించని స్థాయిలో హిట్ సాధించిన ఈ చిత్రం, రికార్డు వసూళ్లు సాధించి యానిమేషన్ సినిమాల స్థాయిని మరింత పెంచింది. ఇప్పటికీ ఈ చిత్రం సాలిడ్ రన్‌ను కొనసాగిస్తుండటమే దీని విజయానికి నిదర్శనం. ఇలాంటి విజయం తర్వాత ప్రేక్షకులు, అభిమానుల్లో తదుపరి ప్రాజెక్టులపై అంచనాలు…