టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీలీల అని చెప్పవచ్చు. స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతోనూ వరుస ప్రాజెక్టులు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ లీగ్‌కి చేరిన ఈ ముద్దుగుమ్మ, ఎంత ఫ్లాపులు వచ్చినా తన క్రేజ్‌ను ఏమాత్రం కోల్పోకుండా కొనసాగిస్తోంది. ముఖ్యంగా గ్లామర్, డ్యాన్స్ పరంగా శ్రీలీల, తన ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటోంది. అందుకే సినిమాలు ఆడకపోయినా, కొత్త ప్రాజెక్టులు వరుసగా ఆమె ఖాతాలో పడుతుండటం ఆమె పెరుగుతున్న క్రేజ్‌కు నిదర్శనం.
Also Read : Sruthihasson : నా స్టార్‌డమ్‌కి కారణం తెలుగు ప్రేక్షకులే..
అయితే ఇటీవల టాలీవుడ్ ఫ్యామిలి స్టార్ జగపతి బాబు ‘ జయమ్ము నిశ్చయమ్మురా’ అనే ఒక టాక్‌షోలో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా ఎపిసోడలో శ్రీలీల గెస్ట్ గా హాజరు కాబోతుంది. రీసెంట్ గా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. జగపతిబాబు శ్రీలీల కౌంటర్లు ప్రేక్షకులను బాగా అలరించాయి. “మేమందరం ఇండస్ట్రీకి వచ్చి యాక్టింగ్ నేర్చుకున్నాం.. నువ్వు మాత్రం యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చావు” అని జగపతి బాబు అనగానే, “మీరు నన్ను పొగిడారా లేక తిట్టారా?” అని శ్రీలీల సూటిగా పంచ్ వేసింది. ఇంతలోనే..
జగపతిబాబు ఆమె లుక్స్ గురించి ఒక టాపిక్ చెబుతానంటూ మాట్లాడగా, “ఆ టాపిక్ తెరపైకి వస్తే.. నేను మీ మేటర్ బయట పెడతా” అంటూ కౌంటర్ వేసింది శ్రీలీల. దీంతో జగపతి బాబు ఒక్కసారిగా షాక్‌కి గురవ్వగా, ఆ తర్వాత స్మైల్‌తో సర్దేశారు. “మీ హీరోయిన్ గారు.. మీరు ఒకరు” అంటూ సరదాగా హింట్ ఇచ్చిన శ్రీలీల మాటలు ఇంట్రస్ట్ పెంచేశాయి. ఇంతలోనే శ్రీలీల తల్లిని స్టేజ్ మీదకు తీసుకొచ్చి జగపతి బాబు సర్‌ప్రైజ్ ఇవ్వడం మరింత ఎమోషనల్ మోమెంట్‌గా మారింది. “నేను మీకు పెద్ద ఫ్యాన్” అని ఆమె తల్లి చెప్పడంతో, అక్కడున్న ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టేశారు. మొత్తం మీద ఈ టాక్‌షో ప్రోమోలో శ్రీలీల – జగపతిబాబు జంటగా వేసిన పంచులు, వార్నింగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. మరి ఫుల్ ఎపిసోడ్‌లో ఇంకా ఎలాంటి ఫన్ మోమెంట్స్ ఉన్నాయో చూడాలంటే అభిమానులు ఎదురుచూడాల్సిందే.