తాజాగా విడుదలైన చిత్రాలు ‘ మ్యాడ్ స్క్వేర్’, ‘రాబిన్ హుడ్’, ‘లూసిఫర్ 2’, ‘వీరధీరశూర’ ఈ నాలుగు సినిమాలు ఒక్కో చోట ఒక్కో టాక్ తెచ్చుకున్నాయి. అయితే వీటిలో అన్నిటికంటే బాగా బజ్ ఉన్న మూవీ ‘ మ్యాడ్ స్క్వేర్’. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ సినిమా హిట్ కావడంతో సిక్వెల్ గా ‘ మ్యాడ్ స్క్వేర్’ కూడా తీశారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తీసిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించగా, సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకున్ని హిట్ టాక్‌తో ధూసుకుపోతుంది. కానీ కొంత మంది మాత్రం ఈ సిపిమాపై రివ్యూ నెగిటివ్‌గా ఇస్తున్నారట. దీనిపై తాజాగా సీతారా నిర్మాత నాగ వంశీ ఫైర్ అయ్యారు.
Also Read: HIT3 : నాని ‘హిట్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్
‘నా సినిమాని కావాలని ఒక వెబ్సైట్ తొక్కేస్తుంది. సినిమాను చంపే ప్రయత్నం ఇది. కలెక్షన్స్ కనిపిస్తున్నప్పటికీ ఎందుకు సినిమా హిట్ అని ఒప్పుకోవడం లేదు మీరు? మెము ఇంటర్వ్యూ ఇస్తేనే మీ వెబ్ సైట్ లు నడుస్తున్నాయి. మా మీద బ్రతికే మీరు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఎవ్వరి రివ్యూ అక్కర్లేదు. మీ ప్రతి ఒక్క రివ్యూ మేము అంగికరిస్తున్నప్పడు.. హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ అందుకుంటున్న మా సినిమాను ఎందుకు ముందుకు తీసుకెళ్లరు మీరు? మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయిన ఈ నాలుగు రోజుల నుంచి బాగా ఆడుతుంది.. కలెక్షన్‌లు కూడా బాగా వస్తున్నాయి. దీని గురించి ఒక వెబ్సైట్లో మాత్రమే ఆర్టికల్ వచ్చింది. అంటే దీని ఉద్దేశం ఏంటి .. మీరు రివ్యూ రాయకపోతే సినిమా ఆడకూడదా?’ అంటూ ఫైర్ అయ్యారు.