టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. సినిమాకి సినిమాకి తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. చివరగా ‘హయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో హిట్లు అందుకున్ని ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. ఇందులో ‘హిట్ 3’ ఒక్కటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ‘హిట్’ నుంచి వస్తున్న 3వ చిత్రం ఇది. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని హోం బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంత్ త్రిపురనేని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Also Read:Vijay Devarakonda: ‘కింగ్ డమ్’ కు తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం..
యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ నుండి, ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్ డెట్ ఎంతో ఆకట్టుకోగా, టీజర్ ఒక్కసారిగా షాక్‌కి గురిచేసింది. నాని ని చాలా వైల్డ్ గా చూపించారు. ఒక్కో సీన్ వణుకు పుట్టించాయి. సార్ మీకు ప్రాబ్లమ్ లేదంటే ఒక పేరు చెబుతా.. అర్జున్ సర్కార్.. అంటూ సాగే డైలాగ్స్‌లో షురూ అయింది టీజర్. ఎక్కడ కూడా స్టోరీ లీక్ అవ్వకుండా టీజర్ ను బాగా కట్ చేశారు. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని పవర్ ఫుల్ పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు.