హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. గత ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ రాయన్ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ధమాకా దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది.
Also Read : Triptii Dimri : అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుందో ‘త్రిప్తి డిమ్రి’ ముద్దు గుమ్మ..
త్రినాథ రావు దర్శకత్వలో రానున్న మజాకా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను ఇటీవల మొదలుపెట్టారు మేకర్స్. అందులో భాగంగా సరికొత్త ప్రయోగానికి తెరలేపింది యూనిట్. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఎవరు చేయనటు వంటి సాహసం చేస్తున్నారు. నేడు ఈ సినిమాలోని రావులమ్మ అని సాగే సాంగ్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఈ లైవ్ స్ట్రీమింగ్ ను ఏకే ఎంటెర్టైఅంమెంట్స్ హ్యాండిల్ నుండి లైవ్ స్ట్రీమింగ్ కానుంది. కాగా మజాకాను మహా శివరాత్రి కనుకగా ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ రీతువర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ధమ్కీ ఫేమ్ లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
For the FIRST TIME EVER, Watch a Movie Shoot Live 🎥▶️
The shoot of #Mazaka goes Live for the filming of the most celebrated #Ravulamma song 💥
📢 Live Shoot & Chit Chat
🗓️ Tomorrow, 11.30 AM OnwardsCelebrate this Shivaratri with Mazaka – IN CINEMAS FROM FEB 26th 📽… pic.twitter.com/yYImjILNOQ
— AK Entertainments (@AKentsOfficial) February 16, 2025