టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా నటిస్తున్న కొత్త సినిమా ‘కె ర్యాంప్’ పై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. మాస్ ఎలిమెంట్స్‌తో సరికొత్తగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జెయిన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది రిచెస్ట్ చిల్లర్ గయ్’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ ఈ సినిమా ప్రత్యేకతను తెలియజేస్తోంది.ఇటీవలి విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పటి వరకు కిరణ్ చేసిన సినిమాల కంటే ఇది పూర్తి భిన్నమైన జోనర్‌లో రూపొందుతోందని అభిమానులు భావిస్తున్నారు. కొత్త లుక్, మాస్ బాడీ లాంగ్వేజ్‌తో కిరణ్ కనిపించడం ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది.
Also Read : War 2 : CGI కాదు.. నిజంగానే షూటింగ్ చేశారు! కియారా బికినీ BTS వీడియో వైరల్
ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘ఓనమ్’ ను ఆగస్టు 9న విడుదల చేయనున్నారు. ఈ పాట ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. మాస్ బీట్‌తో పక్కా యూత్‌ఫుల్ సాంగ్‌గా ఇది రూపొందిందని టాక్. ‘కె ర్యాంప్’ సినిమాను మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా, స్టైల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌తో తెరకెక్కిస్తున్నారు. కిరణ్ అబ్బవరం కొత్తగా కనిపించనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. మరిని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.