ఈ దీపావళికి “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీతో సిద్ధమవుతున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాకు ‘దిల్ రూబ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.
Also Read : Tollywood : మెగా మల్టీస్టారర్ కు శ్రీకారం.. దర్శకుడు ఎవరంటే.?
కిరణ్ అబ్బవరం రీసెంట్ మూవీ “క” టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఘనవిజయం ఇచ్చిన ఉత్సాహంలో దిల్ రూబా సినిమాను అనౌన్స్ చేసారు. “క” సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా ‘దిల్ రూబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్ ను జనవరి 3న రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం మెకానికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. క సినిమాకంటే ముందు రావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన వాయిదాల అనంతరం ఫిబ్రవరిలో విడుదలకు రెడీ అవుతోంది. దిల్ రూబా ఏ మేర హిట్ సాధిస్తుందో చూడాలి.