కిరణ్ అబ్బవరం, మినిమం గ్యారంటీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తూ, క సినిమాతో హిట్ అందుకుని, కొంతవరకు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత, తన ఎంపికల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే, ఇప్పటికే ‘కే రాంప్’ అనే ఒక సినిమాతో పాటు, ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే మరో సినిమాని పట్టాలెక్కించాడు. ఇక, ఇప్పుడు కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే, కిరణ్ అబ్బవరం తన తదుపరి చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు, శ్రీకాంత్ అడ్డాల ఒక లైన్ చెప్పగా, అది కిరణ్ అబ్బవరానికి బాగా నచ్చిందని అంటున్నారు.
Also Read:Tollywood Producers :దిగివచ్చేందుకు సిద్దమైన ఫెడరేషన్..ఛాంబర్లో నిర్మాతల అత్యవసర సమావేశం?
ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని రమ్మని చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాక, కిరణ్ అబ్బవరానికి నచ్చితే, ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాని దగ్గుబాటి రానా నిర్మించే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి సినిమా పట్టాలు ఎక్కుతుందా లేదా అనే విషయం మీద పూర్తి అవగాహన లేదు. ఎందుకంటే, శ్రీకాంత్ అడ్డాల చేసిన చివరి చిత్రం ‘పెదకాపు’ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే, ఆయన చాలా గ్యాప్ తీసుకుని ఈ కథ రాసుకున్నాడు. కిరణ్ అబ్బవరానికి లైన్ నచ్చినా, ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాక సినిమా నచ్చుతుందా లేదా అనేదాన్ని బట్టి, సినిమా పట్టాలు ఎక్కుతుందా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.