విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన “కింగ్డమ్” జూలై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో దర్శకులు సందీప్ రెడ్డి వంగా, గౌతమ్ తిన్ననూరితో కలిసి విజయ్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘కింగ్డమ్ బాయ్స్’ పేరుతో ఈ ప్రత్యేక ప్రమోషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : Mrunal Thakur : అమ్మని కావాలనుంది.. కానీ – మృణాళ్ ఎమోషనల్
అయితే విజయ్ ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. ‘నా కింగ్డమ్ ను డిజైన్ చేసిన చీఫ్ ఆర్కిటెక్ట్ (సందీప్ వంగా) ఒకవైపు, దాన్ని మరో పటిష్ట స్థాయికి తీసుకెళ్లే కొత్త ఆర్కిటెక్ట్ (గౌతమ్ తిన్ననూరి) మరోవైపు ఉన్నారు” అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ద్వారా విజయ్-సందీప్ కాంబో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన “కింగ్డమ్” సినిమా కూడా అదే స్థాయిలో సెన్సేషన్ సృష్టిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 26 సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుండగా. సినిమా మ్యూజిక్, పోస్టర్స్, టీజర్‌లకు వచ్చిన రెస్పాన్స్‌కి తగినట్లే ఈ ట్రైలర్ కూడా విపరీతమైన హైప్‌ను అందుకుంటుందని టాక్.