Mrunal Thakur : అమ్మని కావాలనుంది.. కానీ – మృణాళ్ ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మరాఠీ బ్యూటీ మృణాళ్ ఠాకూర్. ఇప్పటివరకు తెలుగులో ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో నటించిన ఆమె, తొలి రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశ పరచింది. ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే సినిమాలో నటిస్తుండగా, బాలీవుడ్‌లో కూడా ‘సన్నాఫ్ సర్దార్ 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read : Lokesh : ‘ఎల్‌సీయూ’ ఆ ఒక్క ఆలోచనతో మొదలైంది – లోకేష్ ఓపెన్ టాక్!
Also Read
- Soori: కమెడియన్ నుంచి హీరోగా.. ఒక్క సినిమాకు రూ.25 కోట్లు?.. సూరి రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
- Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
- Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
ఇటీవల మీడియాతో మాట్లాడిన మృణాళ్, పెళ్లి విషయంలో తన ఆలోచనలు షేర్ చేసారు. ‘నాకు పెళ్లి కావాలి, తల్లిగా మారాలనే కోరిక ఉంది. భవిష్యత్తులో భర్త, పిల్లలతో నిండిన జీవితం గురించి కలలు కంటూ ఉంటాను. కానీ ప్రతి విషయానికీ సరైన సమయం ఉంటుందనీ నమ్ముతాను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కెరీర్ పైనే. నటిగా ఇంకా ఎన్నో చేయాలని ఉంది. ఒకసారి కెరీర్ పరంగా సంతృప్తి పొందిన తర్వాత నా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెడతా’ అని మృణాళ్ హాయిగా నవ్వుతూ చెప్పింది. ఆమె అందం, అభినయం, టాలెంట్‌కి మృణాళ్‌కు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లో సమాంతరంగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ నటికి పెళ్లిపై ఉన్న శాంతమైన దృక్పథం చాలామందిని ఇంప్రేస్ చేసింది. మొత్తంగా చెప్పాలంటే, మృణాళ్ ఠాకూర్ – కెరీర్‌కి ప్రాధాన్యం ఇస్తూ, జీవితాన్ని ప్లాన్ చేసుకుంటున్న నటిగా మరోసారి మెప్పించింది.
తాజావార్తలు
-
Soori: కమెడియన్ నుంచి హీరోగా.. ఒక్క సినిమాకు రూ.25 కోట్లు?.. సూరి రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!