నిన్నటికి నిన్న’KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి “ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని ‘ఎక్స్’ వేదికగా రష్మిక చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ ట్వీట్ పై విమర్శలు కూడా అంటే రేంజ్ లో వస్తున్నాయి. కొందరైతే పోయి పోయి దయ గురించే ఈవిడే మాట్లాడాలి. ‘KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ వేసుకున్నాకే ఇలా చెప్పాలని ఆలోచన చేసింది రష్మిక. ఆమె ఇంత దయగల్లదే అయితే పుట్టి పెరిగిన ఊరి పేరు చెప్పుకోడానికి అంత నాముషీగా ఎందుకు ఫీల్ అవుతుంది. నువ్వు చెప్పే దయ నీ ఊరి మీద లేదా తల్లి అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
Also Read : Thandel : తండేల్ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ఎవరంటే..?
ఇక మరో నెటిజన్ ‘ నిన్ను పిలిచి నీకంటూ ఓ ఛాన్స్ ఇచ్చి నీకో గుర్తింపు ఇచ్చిన రిషబ్ శెట్టిని కనీసం గౌరవించకుండా నీకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చింది ఎవరో చెప్పమని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగినప్పుడు సోకాల్డ్ ప్రొడక్షన్ హౌజ్ అని చేప్పావు అంటే నీకు మొదటి అవకాశం ఇచ్చిన గురువు మీద నీకు ఎంత దయ తల్లి అని కామెంట్ చేసారు. పోనీ ఇప్పటివరకు రష్మిక చూపిన దయ తాలుకా లిస్ట్ ఏమైనా ఉందా అంటే ఓ నెటిజన్ ఏమి లేదండి ఓ టీ షర్ట్ కొనుక్కుంది. దాని మీదున్న లైన్స్ చదివి ఇదేదో బాగుంది కొత్తగా అనుకుని,ఈ ట్వీటర్ ఒకటి ఉందిగా రాసుకోడానికి, అందులో పిట్టలు పట్టాను అని చెప్పినా కూడా వైరలే అవుతుంది, తనకి లేని గుణం గురించి దీనికింత బిల్డప్ ఇచ్చుకోడం దేనికి అని బదులిచ్చాడు.