యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా బుజ్జి తల్లి సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. ఎక్కడ చూసిన ఈ పాటే ఇప్పుడు ట్రేండింగ్.
Also Read : OTT : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘గేమ్ ఛేంజర్’.. ఫ్యాన్స్ షాక్
అక్కినేని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చుసిన తండేల్, భారీ అంచనాల మధ్య నేడు థియేటర్లలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ తో పాటు ఈ సినిమా డిజిటల్ పార్టనర్ ను కన్ఫామ్ చేసారు మేకర్స్. తండేల్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. నాగ చైతన్య కెరీర్ లోనే భారీ ధరకు తండేల్ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్టు సమాచారం. థియేటర్స్ లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేశారట తండేల్ మేకర్స్. ఇదిలా ఉండగా ఓవర్సీస్ ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన తండేల్ పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. మరి ముఖ్యంగా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి జోడి మెప్పించిందని సూపర్ హిట్ అనే టాక్ ఓవర్సీస్ నుండి వినిపిస్తోంది.