బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఒక ఉపు ఊపిన వారిలో కరీనా కపూర్ ఒకరు. తన నటన అందంతో దాదాపు అందరు హీరోలతో పని చేసిన ఈ హాట్ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక గత మూడు దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతున్న కరీనా గతేడాది ‘క్రూ’, ‘సింగమ్ అగైన్’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రజంట్ మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ వరుస చిత్రాలు, సిరీస్‌లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు తెరపై బోల్డ్ సన్నివేశాల్లో నటించడం గురించి వైరల్ కామెంట్స్ చేసింది..
కరీనా మాట్లాడుతూ.. ‘ ప్రతి ఒక ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాల్ని అంగీకరించడానికి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే తెరపై అలా చేయడం అసౌకర్యంగా ఉంటుంది. నిజానికి నేను ఎప్పుడూ అలాంటి పాత్రల్లో నటించలేదు. ఇలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా ఇబ్బందులు పడినట్లు ఇప్పటికీ చాలా మంది హీరోయిన్స్ తెలిపారు. కొంత మంది ఇబ్బంది ఉన్న తప్పదు అన్నట్టు చేస్తారు. కానీ ఇలాంటి బోల్డ్ సీన్స్ సినిమాకు కచ్చితంగా అవసరమనుకుంటే పెట్టాలి తప్ప ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి కావాలని వీటిని ఇరికించొద్దు. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ చిత్రాలు మహిళల చుట్టూ ఇంటెన్స్ సన్నివేశాల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ మన దేశంలో సంస్కృతి, సంప్రదాయాలకు విలువ లెక్కువ. అందుకే భారతీయ చిత్ర పరిశ్రమ అలాంటి సన్నివేశాలు కూడా తెరపై సంప్రదాయంగా చూపిస్తే బాగుంటుంది’ అని చెప్పుకొచ్చింది కరీనా. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.