కేజిఎఫ్ సినిమాతో కన్నడలో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు యష్. కేజిఎఫ్ పార్ట్ వన్ తో పాటు పార్ట్-2 పూర్తి చేసిన తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండిపోయాడు. అసలు యష్ ఎలాంటి సినిమా ఒప్పుకుంటాడు అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయంలో గీతూ మోహన్ దాస్ అనే మలయాళ లేడీ డైరెక్టర్ కి మనోడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఇక ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి కానీ తాజా ప్రచారం మాత్రం షాక్ ఇచ్చే విధంగా ఉంది.. ఈ సినిమాలో కరీనాకపూర్ నటించబోతోందని కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఊతం ఇచ్చే విధంగా ఆ మధ్య క్రూ సినిమా ప్రమోషన్స్ లో కరీనాకపూర్ కూడా తాను సౌత్ లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో భాగమైనట్లు చెప్పుకొచ్చింది.
Dil Raju : దిల్ రాజు కొడుకు బుడ్డోడే కానీ మాములు కాదయ్యా.. పక్కా హీరోనే..
ఆమె చేస్తున్నది టాక్సిక్ సినిమా అని చెప్పకపోయినా ఆమె దాదాపు ఖరారు చేసేసింది అంటూ అటు నేషనల్ మీడియాతో పాటు సౌత్ మీడియా కూడా రాసుకొచ్చింది. అయితే తాజాగా సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో కరీనాకపూర్ యష్ సరసన హీరోయిన్గా నటించడం లేదని తెలుస్తోంది. యష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సోదరి పాత్రలో కరీనాకపూర్ నటిస్తోంది అని చెబుతున్నారు. కరీనా కపూర్ సౌత్ సినిమాలో నటిస్తోంది అనగానే ఆమె హీరోయిన్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇలాంటి షాకింగ్ అంశం తెర మీదకు రావడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మాత్రం సినిమా రిలీజ్ అయితే తప్ప క్లారిటీ రాదు.