యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. రేపు విడుదల కాబోతుంది.. ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ గట్టిగానే చేస్తున్నారు.. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు నిర్వహించారు.. అలాగే బుల్లితెర పై కూడా ‘ఫ్యామిలీ స్టార్ ‘ టీమ్ సందడి చేశారు.. తాజాగా జరిగిన స్టార్ మా ఉగాది స్పెషల్ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండతో పాటు నిర్మాత దిల్ రాజు తన ఫ్యామిలీ పాటు గెస్టుగా వెళ్లారు.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ ఈవెంట్ ప్రోమో వీడియోలో దిల్ రాజు భార్యను, కొడుకు హైలెట్ చేశారు.. ఈ షో యాంకర్ గా వ్యవహరించిన శ్రీముఖి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు అడిగింది.. ఈ సందర్బంగా దిల్ రాజు భార్య తేజస్విని ని ఒక ప్రశ్న అడిగింది.. మీరు దిల్ రాజు గారిని ఏమని పిలుస్తారు అని అడగ్గా.. ఆమె జాను అని పిలుస్తున్నట్లు చెప్పుకొచ్చింది..దానికి దిల్ రాజు తెగ సిగ్గుపడిపోయారు. ఇక తర్వాత దిల్ రాజు కుమారుడు అన్వయ్ రెడ్డి ఎదురుగా మూడు బాక్సులు పెట్టి ఓ ఆట ఆడించింది.
బుడ్డోడికి ఎదురుగా బాక్సులు పెట్టి శ్రీముఖి ఎమౌతాడో చెప్పేసింది. అందులో మేకప్ బాక్స్ పట్టుకుంటే హీరో, డబ్బులు పట్టుకుంటే ప్రొడ్యూసర్,మెగాఫోన్ పట్టుకుంటే డైరెక్టర్ అవుతాడంటూ శ్రీముఖి చెప్పింది. ఇక దిల్ రాజు కొడుకు నేరుగా వెళ్లి మేకప్ బాక్స్ పట్టుకుంటాడు.. దాంతో శ్రీముఖితో పాటు అక్కడున్న వారంతా హీరో.. హీరో అంటూ గట్టిగా అరుస్తారు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ఇకపోతే ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు విడుదల కాబోతుంది.. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ తో మంచి రెస్పాన్స్ ను అందుకుంది.. ఇక సినిమా ఏ మాత్రం ఆడియన్స్ ను అలరిస్తుందో చూడాలి..