బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. నటిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే హీరో సైఫ్ అలీఖాన్‌ని వివాహం చేసుకుంది. ప్రజంట్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ, అడపదడప సినిమాలు చేస్తుంది. అయితే ఇటీవల ముంబైలోని తన నివాసంలో సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించి మనకు తెలిసిందే. నిందితుడు చేతిలో అనేకసార్లు కత్తిపోటుకు గురైన సైఫ్.. అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్ని ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. సిసిటివి ఫుటేజ్ ఉపయోగించి ముంబై పోలీసులు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెజాద్‌ను ప్రాధమిక నిందితుడిగా అరెస్టు చేశారు. ఈ కేసుపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత సైఫ్ అలాగే కరీనా కపూర్ ఖాన్ పై చాలా పుకార్లు వచ్చాయి. దీంతో కరీనా ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా ఈ అమ్మడు ‘వివాహాలు..విడాకులు’ గురించి వైరల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
‘జీవితంలో మనం అనుకునే సిద్ధాంతాలు, ఊహలు ఏవీ వాస్తవాలు కావు. కానీ కొన్ని విషయాలలో ఇతరుల కంటే మనమే గొప్ప తెలివైన వాళ్లం అనుకుంటాం. కానీ సందర్భం వచ్చినప్పుడు జీవితం మన మెడలు వంచి పాఠాలు నేర్పుతుంది. ముఖ్యంగా ఈ పెళ్లిళ్లు, విడాకులు, ఆందోళన, పిల్లలు పుట్టడం, ఆత్మీయుల మరణాలు, పిల్లల పెంపకం.. ఇవన్నీ మన దాకా వస్తేనే పూర్తిగా అర్థమవుతాయి’ అంటూ చెప్పుకొచ్చింది కరీనా. ఇంతకు ముందు సైఫ్ పై దాడి జరిగిన రోజు కూడా కరీనా పై రకరకాల రూమర్స్ వచ్చాయి..‘సైఫ్ పై దాడి ఇక మా కుటుంబానికి ఎంతో సవాళ్లతో కూడిన రోజు. అసలు ఎలా జరిగిందో మాకు ఇప్పటికీ పూర్తిగా అర్థం కావడం లేదు. ఈ కష్ట సమయంలో కనికరం లేని ఊహాగానాలు, కథనాలకు దూరంగా ఉండాలని మీడియాకు, ఫొటోగ్రాఫర్లకు సవినయంగా మనవి చేస్తున్నా’ అని ఆమె అప్పట్లో రాసుకొచ్చారు. ఇక రీసెంట్ పోస్ట్ చూసుకుంటే కనుక జీవితంలో అన్నింటికి సిద్ధంగా ఉండాలి అని చెప్పకనే చెబుతుంది ఈ అమ్మడు.