మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’. ఈ మూవీని ముందుగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావించారు. అయితే తాజాగా ఈ సినిమాను 2025 ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కన్నప్ప టీం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని విష్ణు మంచు చెప్పారు. ఈ క్రమంలో ఉజ్జయినీ మహాకాళేశ్వర్ దేవాలయంలో కన్నప్ప రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. కన్నప్ప మూవీని 25 ఏప్రిల్, 2025న భారీ ఎత్తున అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు చిత్రం యూనిట్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. పరమ శివుని గొప్ప భక్తుడు కన్నప్ప గురించి ఇప్పటివరకు చెప్పని కథను చూసేందుకు మీ క్యాలెండర్‌లో డేట్‌ను మార్క్ చేసుకోండి. 2025 ఏప్రిల్ 25 వెండి తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది! పురాణ సినిమా ప్రయాణానికి సిద్ధంగా ఉండండి!” అని సినిమా యూనిట్ ట్వీట్ చేసింది. ఇక కన్నప్పలో మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి హేమాహేమీలు నటిస్తుండడంతో ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ నెలకొంది.
RGV: పరారీలో వర్మ.. ఆ ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో ?
ఈ మూవీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ టీజర్ విడుదల చేశారు. మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్‌లో సౌత్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సహా మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఇప్పుడు ఈ పురాణ కథను ఐదు భాషల్లో చూసేందుకు సిద్ధం కావాలని అప్పట్లో టీం ప్రకటించింది.