మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కొన్నిసార్లు వాయిదా పడిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సంపాదించింది. సినిమా బాలేదని అనే వాళ్లు ఉన్నా సరే, ఎక్కువ శాతం మాత్రం సినిమా బాగుందని అంటున్నారు. అయితే ఈ సినిమా టీం మాత్రం ఒక ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ చేయడం చర్చకు తావిస్తోంది.
Also Read:ZEE5 vs Etv Win : వాళ్లే తొందరపడ్డారు.. అంతా కోర్టు చూసుకుంటుంది!
నిజానికి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు కూడా థియేటర్లకు వెళ్లి చూడాలనుకుంటున్నారు. చాలామంది చూస్తున్నారు. అయితే ఏకంగా మొదటి రోజే ఇండస్ట్రీ హిట్ కన్నప్ప అంటూ పోస్టర్ రిలీజ్ చేయడంతో ఒక్క రోజులోనే ఇండస్ట్రీ హిట్ స్టేటస్ సాధించిన ఘనత ఈ సినిమాకే దక్కుతుంది అంటూ సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు.
Also Read:Kannappa : కన్నప్ప డే 1 కలెక్షన్స్… ఎంతంటే?
ఎందుకంటే నిజానికి ఇండస్ట్రీ హిట్ అనే పదానికి అర్థం ఏమిటంటే, ఏదైనా ఇండస్ట్రీలో అప్పటివరకు ఉన్న హిట్ సినిమా రికార్డులను ఈ సినిమా తిరగరాసి అత్యధిక కలెక్షన్లు రాబడితే దాన్ని ఇండస్ట్రీ హిట్ అని అభివర్ణిస్తారు. కానీ మంచు విష్ణు సినిమా టీం ఏమని ఆలోచించిందో తెలియదు, కానీ ఏకంగా రెండవ రోజు ఇలా రికార్డు స్థాయిలో ఇండస్ట్రీ హిట్ పోస్టర్ రిలీజ్ చేయడం చర్చకు తావిస్తోంది. మరి దీనిపై మంచు విష్ణు ఏమని స్పందిస్తారో వేచి చూడాలి.