తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ ‘కన్నప్ప’. మంచు విష్ణు హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. డా.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ఆయన ‘మహదేవ శాస్త్రి’ అనే పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
Also Read: ‘Anora’ : ఈ ఏడాది ఐదు ఆస్కార్‌లు అందుకున్న ‘అనోరా’ ఇప్పుడు తెలుగు OTT లో
ఇక ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా. సోషల్ మీడియాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ నుండి ‘మహదేవ శాస్త్రి’ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఆయన ఇంట్రో సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయం అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ నుంచి నిత్యం వివాదాల్లో, వార్తల్లో నిలుస్తూనే ఉంది. శివయ్య సాంగ్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే కాదు.. లవ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటి పై మంచి విష్ణు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాడు. కన్నప్ప సినిమా 2 వ శతాబ్దం నాటిది. అప్పటి వారు ధరించిన దుస్తులు ఎలా ఉన్నాయి.. అప్పటి పరిసరాలు అన్నింటిని క్లుప్తంగా తెలుసుకుని సినిమా తీస్తున్నాం. అంటూ ప్రమోషన్ లో భాగంగా పంచుకున్నాడు.